Bus stand | బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిపై అగ్రో చైర్మన్ దాడి

Bus stand | బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిపై అగ్రో చైర్మన్ దాడి

Bus stand | రుద్రూర్, ఆంధ్రప్రభ : బాన్సువాడ నియోజకవర్గం లోని కొంతమంది కాంగ్రెస్ నాయకుల ఆగడాలు అరాచకాలు పెరిగిపోతున్న దానికి నిదర్శనం రుద్రూర్ మాజీ గ్రామ సర్పంచ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్ పై రాష్ట్ర ఆగ్రో పరిశ్రమల చైర్మన్ కాసుల బాలరాజ్ దాడి చేశారు. చంద్రశేఖర్ తన మిత్రుడైన న్యాయవాది వెంకటరమణ రెడ్డి ఇంట్లో ఫంక్షన్ కి వెళ్లి తిరుగు ప్రయాణం లో వస్తుండగా బాన్సువాడ బస్టాండ్ సమీపంలో వాహనాన్ని అడ్డుకొని ఎన్నికల ప్రచారానికి వచ్చినావంటూ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడుని గల్లా పట్టుకొని దాడికి పాల్పడ్డాడు. తాను ఎన్నికల ప్రచారానికి రాలేదని వెంకటరామన్ రెడ్డి ఇంటికి వచ్చి నానాన్ని చెప్పినప్పటికీ చంద్రశేఖర్ పై అసభ్య పదజాలం దూషిస్తూ దాడి చేశారు.

తన మిత్రుడైన వెంకటరమణ రెడ్డికి ఇంటి భోజనానికి వెళ్లి తిరిగి రుద్రూర్ కు వస్తుండగా తన కారుని అడ్డుకొని కాసుల బాల్రాజ్ తనపై దాడికి పాల్పడడమే కాకుండా కాసుల బాల్రాజ్ తన జేబులో నుంచి 50 రూపాయల తన చేతుల్లో పెట్టి తాను ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంచుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారని ఇందూర్ చంద్రశేఖర్ తెలిపారు.

Bus stand |

ఆయన వద్ద ఉన్న డబ్బులు తన చేతిలో పెట్టి తానే డబ్బులు పంచుతున్నట్లు చేయడానికి వచ్చినట్లు కాసుల బాలరాజ్ తనపై దాడికి పాల్పడమే కాకుండా పోలీస్ స్టేషన్లో తన అధికార బలంతో నిర్బంధించారని చంద్రశేఖర్ తీవ్రంగా ఆరోపించారు. తనపై దాడికి పాల్పడ్డ కాసుల బాలరాజు పై అధిష్టానం కు ఫిర్యాదు చేస్తానని ఆయన వెల్లడించారు.

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పై దాడిని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం రోజు రుద్రూర్ బస్టాండ్ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ధర్నాచేస్తూ కాసుల బాలరాజ్ డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం కాసుల బాలరాజు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత అవసరమైతే ధర్నాలు రాస్తారోకులు నిర్వహిస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply