bus shelter | కీచులాటపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..

bus shelter | కీచులాటపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..

  • సర్పంచ్ అభ్యర్థి కొత్త శ్రీనివాస్ జోరుగా ప్రచారం

bus shelter | జూలపల్లి, ఆంధ్రప్రభ : తనను ఆదరించి కీచులాటపల్లి గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే ప్రజలకు నిరంతరం అందుబాటు(availability)లో ఉంటూ.. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ అభ్యర్థి కొత్త శ్రీనివాస్ కోరుతున్నారు. ఇవాళ జూలపల్లి మండలం కీచులాటపల్లి గ్రామంలో ఇంటింటా తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కలిసి ప్రచారం జోరుగా చేశారు. ప్రజలు కూడా శ్రీనివాస్ కు మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈసందర్భంగా కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ… తనను గెలిపిస్తే గ్రామంలో రేషన్ దుకాణం(ration shop) ఏర్పాటు చేయిస్తానని, స్మశాన వాటిక వరకు రోడ్డు వేయిస్తానని తెలిపారు. అలాగే అంగన్వాడీ భవన నిర్మాణం, గ్రామపంచాయతీ భవన నిర్మాణం, పోచమ్మ తల్లి ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

పంట పొలాలకు వెళ్లే రోడ్డు నిర్మిస్తానని, బస్ షెల్టర్(bus shelter) ఏర్పాటు చేయిస్తానని, చెరువు కట్టను సుందరీకరిస్తానని ప్రజలకు మాట ఇస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ప్రజలు కూడా ఆయనకు మద్దతుగా ఉంటామని చెప్పడంతో గెలుపుపై కొత్త శ్రీనివాస్ ధీమాతో ఉన్నారు.

Leave a Reply