అంబులెన్స్ ను ఢీ కొట్టిన బస్సు…

అంబులెన్స్ ను ఢీ కొట్టిన బస్సు…

  • అక్కడికక్కడే ఇద్దరి మృతి
  • ఒకరికి తీవ్ర గాయాలు….

బిక్కనూర్, ఆంధ్రప్రభ ; కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర పల్లి గ్రామ శివారులో గల 44వ జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సైపుల్లా ఖాన్ తన భార్య సలేహాభాను ను హైదరాబాదులో వైద్యం చేయించుకుని అంబులెన్స్ లో తిరిగి ఆదిలాబాద్ వెళ్తున్నారు. మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామ శివారుకు అంబులెన్స్ రాగానే కాశీ వెళ్తున్న బస్సు అతివేగంగా వచ్చి అంబులెన్స్ను ఢీ కొట్టింది.

దీంతో పేషంట్ సలేహా భాను అంబులెన్స్ డ్రైవర్ షేక్ సర్దార్ అక్కడికక్కడే మృతి చెందారు సైపుల్లా కానుకు తీవ్రగాయాలు అయ్యాయి వెంటనే గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply