20 గొర్రెల మృతి
మెదక్ బ్యూరో, ఆంధ్రప్రభ : మెదక్ (Medak) జిల్లా కొల్చారం అటవీ ప్రాంతంలో బస్సు అదుపు తప్పింది. మూలామలుపు వద్ద బస్సు అదుపు తప్పి గొర్రెల మంద వైపు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 20కి పైగా గొర్రెలు మృతి చెందాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.