Bus Accident | మరో ఘోర ప్రమాదం..

Bus Accident | మరో ఘోర ప్రమాదం..
Bus Accident, గన్నవరం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా గన్నవరం (Gannavaram) మండలం చిన్న అవుటపల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యూటర్న్ తీసుకుంటున్న లారీనీ బస్సు ఢీకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లాకు చెందిన పెళ్లి బృందం శ్రీకాకుళంలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో గన్నవరం మండలం చిన్న అవుటపల్లి మిశ్రా హోటల్ సమీపంలో కెమికల్ పౌడర్ లోడుతో హనుమాన్ జంక్షన్ నుంచి వస్తున్న ఓ లారీ హైదరాబాద్ వెళ్లేందుకు యూ టర్న్ తీసుకుంటుంది. అదే సమయంలో విజయవాడ వెళ్తున్న పెళ్లి బృందం బస్సు లారీని బలంగా ఢీకొట్టింది. అదే సమయంలో వెనక వస్తున్నా కారు బస్సును బలంగా ఢీకొంది.

Bus Accident | ఆదివారం జరిగిన ప్రమాదం మరువకముందే
Bus Accident | ఈ ప్రమాదంలో బస్సులోని 17 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, బస్సు డ్రైవర్ కు కాలు విరిగింది. బస్సు డ్రైవర్ను పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ఆత్కూరు పోలీసులు (Police) హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్ సహాయంతో రోడ్డు మీద ఉన్న బస్సును, కారును తొలగించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం మరువకముందే మరొక రోడ్డు ప్రమాదం జరగడం పై వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
Click Here To Read> రైవాడలో పడవ బోల్తా
