బులియన్ తాయిలం
(ఆంధ్రప్రభ , బిజినెస్ డెస్క్) : బులియన్ మార్కెట్ (bullion market) గోల్డ్ ప్రియులను ఊరిస్తోంది. ఈ రోజు బంగారం ధర తగ్గుతున్నట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోజు ( 6.10.25 సోమవారం) 10 గ్రాముల బంగారం ధర వేలం పాట రూ.10లకు తగ్గించింది. గురు , శుక్రవారాల్లో పసి ప్రేమికులను అలరించిన బులియన్ మార్కెట్ శనివారం తన ప్రతాపాన్ని చూపింది. ఇక బంగారం ప్రియుల్లో అలజడి రగిలింది. సోమవారం నుంచి ఇదే రూట్ లో ధర దూసుకుపోతే.. ఇంక బంగారం కొనగలమా? అని ప్రశ్నించుకున్నారు. ఈ ట్రెండ్ ను ముందే పసిగట్టిన బులియన్ మార్కెట్.. ధర తగ్గింపు వరాన్ని సంధించింది.
ఈ రోజు బంగారం ధర ఏ స్థితిలో ఉందంటే.. సోమవారం (Monday) ఉదయం 10.00 గంటలకు అందిన సమాచారం మేరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,19,390లు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,09,490లు, 18 క్యారెట్ల బంగారం ధర రూ.89,540లతో ప్రారంభమైంది. ఇక ఈ ధర క్రమంగా తగ్గుతుందా? పెరుగుతుందా? అనేది గోల్డ్ లవర్స్ డౌటనుమానం. శనివారం పెరిగిన బంగారం ధరను అంచనా వేస్తే.. ఆరోజు రాత్రి రాత్రి 9.00 గంటలకు అందిన సమాచారం మేరకు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,18,040ల నుంచి రూ.1,19,400లకు చేరింది. అంటే ..రూ.1360లు పెరిగింది.
22 క్యారెట్ల బంగారం రూ.1,08,200ల నుంచి రూ.1,09,450లకు చేరింది. అంటే రూ.ధర 1250లు పెరిగింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.88, 530ల నుంచి రూ.89, 550లకు చేరింది. రూ.1,020లు పెరిగింది. తాజాగా శనివారం ధరను రూ.10లు తగ్గించి బులియన్ మార్కెట్ .. ఈ రోజు బంగారం ధర తగ్గుతుందని గ్రీన్ సిగ్నల్ (Green signal) ఇచ్చింది. ఈ రోజు సాయంత్రానికి బంగారం ఏ స్థాయిలో తగ్గింది? లేక యథాస్థితిలో కొనసాగిందా? అనే విషయం ఈ రోజు సాయంత్రం తెలుసుకుందాం.
నగరం 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 18 క్యారెట్స్
హైదరాబాద్ రూ.1,19,390లు రూ.1,09,440 లు రూ.89,540లు
వరంగల్ రూ.1,19,390లు రూ.1,09,440 లు రూ.89,540లు
విజయవాడ రూ.1,19,390లు రూ.1,09,440 లు రూ.89,540లు
గుంటూరు రూ.1,19,390లు రూ.1,09,440 లు రూ.89,540లు
విశాఖపట్నం రూ.1,19,390లు రూ.1,09,440 లు రూ.89,540లు
చెన్నై రూ.1,19,450లు రూ.1,09,490లు రూ.90,490లు
కోల్కత్త రూ.1,19,390లు రూ.1,09,440 లు రూ.89,540లు
ముంబై రూ.1,19,390లు రూ.1,09,440 లు రూ.89,540లు
ఢిల్లీ రూ.1,19,390లు రూ.1,09,440 లు రూ.89,540లు
బెంగళూరు రూ.1,19,390లు రూ.1,09,440 లు రూ.89,540లు
కేరళ రూ.1,19,390లు రూ.1,09,440 లు రూ.89,540లు
అహ్మదాబాద్ రూ.1,19,440లు రూ.1,09,490లు రూ.89,590లు
వడోదర రూ.1,19,440లు రూ.1,09,490లు రూ.89,590లు