వ్యవసాయానికి విఘాతం..

వ్యవసాయానికి విఘాతం..

  • పాముకాటుతో ఎద్దు మృతి
  • రైతుకు రూ.80 వేల నష్టం

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; వ్యవసాయ పొలం వద్ద మేతమేస్తుండగా ప్రమాదవశాత్తు పాముకాటుకు గురై కాడెద్దు (కోడె) మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మొగ్దుంపూర్ లో మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి బాధిత రైతు కోట్ల రామచందర్ కథనం ప్రకారం ఊట్కూరు మండల పరిధిలోని మొగ్దుంపూర్ గ్రామంలో మంగళవారం ఉదయం వ్యవసాయ పొలం వద్ద కాడెద్దులు మేతమేస్తుండగా ఒక ఎద్దుకు పాముకాటు వేయగా కొంత సమయం తర్వాత నోట్లో నుండి నురగలు రావడంతో ఎద్దులు గమనించిన రైతు సమీప రైతులకు సమాచారం ఇచ్చేలోపు తన పొలంలోనే మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న తన ఎద్దు మృతి చెందడంతో వ్యవసాయం చేసేందుకు తీవ్ర ఇబ్బంది తలెత్తుతుందని విలేకరులతో వాపోయాడు. మృతి చెందిన ఎద్దు విలువ సుమారు రూ. 80 వేలు ఉంటుందని తెలిపారు. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ తిరుమలేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై పశుసంవర్ధక రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు రైతు తెలిపారు.

Leave a Reply