Budumdev Jatara | ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా..

Budumdev Jatara | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ బుడుందేవ్ జాతర పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మెస్రం వంశీయులతో కలిసి ఈ రోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అభివృద్ధి గురించి మాట్లాడుతూ… ఆలయానికి చుట్టు ప్రహరీ గోడను ఏర్పాటు చేస్తానని, మహిళలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక బాత్రూమ్ లు నిర్వహిస్తామన్నారు. నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక బోర్వెల్ వేయిస్తామని చెప్పారు. అలాగే హైదరాబాద్ కు చెందిన నాగేంద్ర ఆధ్వర్యంలో మేస్త్రం వంశీయుల మహిళలకు చీరలు అందచేశారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశస్తులు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

