ఆరేళ్ల త‌ర్వాత మ‌రోసారి…

ఆరేళ్ల త‌ర్వాత మ‌రోసారి…

వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్రభ : అమెరికా ప్ర‌భుత్వం పూర్తిగా ష‌ట్‌డౌన్(Shutdown) అయింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌పంచ దేశాల‌పై టారిఫ్‌ల‌ను విధిస్తూ సంచ‌ల‌నాలు రేక‌త్తించిన అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) త‌న ప్ర‌భుత్వంలో జ‌రిగిన ప‌రిణామంపై ఎలా చ‌క్క‌దిద్దుతారో అమెరికా ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నారు. అమెరికాలో బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోవడంతో అమెరికా ప్రభుత్వం పూర్తిగా షట్ డౌన్ (US government shutdown) ప్రారంభమైంది.

దాదాపు ఏడు సంవత్సరాల విరామం తర్వాత తొలిసారిగా అమెరికా షట్ డౌన్ బాట పట్టింది. ప్రభుత్వ ఖర్చులకు నిధులు సమకూర్చే బిల్లును సెనేట్ ఆమోదించడంలో విఫలం కావడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. అమెరికా(America)లో అక్టోబర్ 1న కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభం అవుతుంది. ప్రభుత్వం నడవడానికి అవసరమైన నిధుల బిల్లుకు కాంగ్రెస్‌ (అంటే హౌస్, సెనెట్) ఆమోదం తెలిపింది.

ఈ సంవత్సరం అధికార రిపబ్లికన్లు తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీకి సెనేట్‌లో తాత్కాలిక నిధుల బిల్లును ఆమోదించడానికి కనీసం 60 ఓట్లు అవసరం. కానీ ఆ బిల్లు కేవలం 55 ఓట్లు మాత్రమే పొందగలిగాయి. దీంతోప్రభుత్వానికి ఇప్పుడు అవసరమైన నిధుల పొడిగింపు లేదు. దీంతో అమెరికా ప్ర‌భుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్లింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మొదలు కాగానే (భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 9:30కి) ఈ ప్రక్రియ ప్రారంభమైంది.

సాధారణంగా ప్రభుత్వంలోని వివిధ విభాగాలు పనిచేయడానికి, సేవలను కొనసాగించడానికి భారీ మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. అమెరికాలో కూడా ఇందుకోసం చ‌ట్ట‌స‌భ‌ (కాంగ్రెస్) బడ్జెట్ లేదా నిధుల బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. అమెరికాలో కొత్త ఆర్థిక సంవత్సరం అక్టోబర్ 1న ప్రారంభమవుతుంది. అందుకే నిధుల బిల్లులకు సెప్టెంబర్ నెలాఖరులోపు కాంగ్రెస్(Congress) ఆమోదించాలి.

అయితే రాజకీయ విభేదాలు లేదా ప్రతిష్టంభన కారణంగా నిర్ణీత గడువులోపు నిధుల బిల్లు ఆమోదం పొందనప్పుడు… ప్రభుత్వానికి చట్టబద్ధంగా ఖర్చు చేయడానికి నిధులు లేకుండా పోతాయి. అటువంటి పరిస్థితిలో, అమెరికా ప్రభుత్వం అనవసర సేవలను నిలిపివేయవలసి వస్తుంది. నిధుల ఆమోదించబడే వరకు అవసరం లేని ప్రభుత్వ విభాగాలు, సేవలు మూసివేయాలి. దీనిని అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ అని పిలుస్తారు.

ప్రభుత్వ షట్‌డౌన్ సమయంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించవచ్చు లేదా సెలవులపై పండం లేదా జీతం లేకుండా పని చేయించవచ్చు. ఈ షట్‌డౌన్ అనేక రోజువారీ ప్రభుత్వ సేవలను ప్రభావితం చేస్తుంది. సామాజిక భద్రత, సైనిక విధులు, ఇమ్మిగ్రేషన్(Immigration) అమలు, ఎయిర్ ట్రాఫిక్(Air Traffic) నియంత్రణ వంటి ముఖ్యమైన సేవలు మాత్రం కొనసాగనున్నాయి.

అయితే ఇతర సేవలు అంతరాయం కలగడం, ఆలస్యం కావడం జరుగుతుంది. అయితే దీర్ఘకాలిక షట్‌డౌన్ ఆర్థిక వృద్ధిని నెమ్మదించేలా చేస్తుందని, మార్కెట్లను దెబ్బతీస్తుంది. దీనికితోడు ఈ సారి షట్‌డౌన్ ముప్పును తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ దీనిని ఒక సాకుగా ఉపయోగించి లక్షలాది మంది ఉద్యోగులను తొలగించవచ్చని, అనేక కీలక ప్రాజెక్టులను నిలిపివేయవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.

అమెరికాలో హెల్త్ , హ్యూమన్ సర్వీసెస్ ఏజెన్సీ(Health , Human Services Agency)లలో దాదాపు 41% మంది ఉద్యోగులు పనికి దూరం కానున్నార‌ని స‌మాచారం. షట్‌డౌన్ ప్రభావంతో ప్రజారోగ్యం, విమాన రవాణా, సామాన్య ప్రభుత్వ సేవల్లో అంతరాయం కలుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే రక్షణ, పోలీస్(police), అత్యవసర వైద్య సేవలు వంటి కీలక విభాగాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కానీ ఉద్యోగులకు జీతాలు లేకుండానే పని చేయాల్సిన పరిస్థితి రావొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు, ప్రజా సౌకర్యాలకు సంబంధించిన వందల సేవలు నిలిచిపోవడంతో సాధారణ పౌరులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. కాంగ్రస్‌లో చర్చలు కొనసాగుతున్నప్పటికీ, బడ్జెట్ ఆమోదం ఎప్పటికి జరుగుతుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

తమ డిమాండ్లు నెరవేర్చని రిపబ్లికన్ స్థాపేజ్ ఫండింగ్(Republican establishment funding) బిల్లును డెమోక్రాట్లు అడ్డుకోవడంతో ఈ షట్ డౌన్ మొదలైంది. దీంతో అత్యవసరం కాని సేవల కార్యకలాపాలు నిలిచిపోతాయి. అమెరికా (USA)లో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాదాపు 7,50,000 మందిని పని ప్రదేశంలో రిపోర్టు చేయవద్దంటారు. మిలిటరీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి విభాగాల్లోని లక్షల మంది సిబ్బంది మాత్రం అత్యవసర సేవలు కొనసాగించాల్సి ఉంటుంది.

వీరితో సెలవుల్లో కూడా పని చేయించుకొని చెక్ ఇవ్వని పరిస్థితి ఉంటుంది షట్ డౌన్ ముగిశాకే. వారికి పాత వేతనాల చెల్లింపులు జరుగుతాయి. కొన్నికాంట్రాక్టుల్లో ఈ చెల్లింపులకు ఎలాంటి హామీలు ఉండవని తెలిపింది. సోషల్ సెక్యూరిటీ(social security), మెడికేర్ లబ్దిదారులపై దీని ప్రభావం ఉండదు. వీరికి సంబంధించిన ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రత్యేక చట్టం రూపంలో ఆమోదం తెలుపుతుంది.

వీటికి వార్షిక చెల్లింపులు అవసరం లేదు. కానీ, సోషల్ సెక్యూరిటీ ఆఫీస్లు అందించే ప్రయోజనాలు పరిమితంగా ఉంటాయి. నేషనల్ పార్క్ సర్వీసులు మూతపడతాయి. 2013లో వందలకొద్దీ పార్కులు, మ్యూజియంలు, ఇతర ప్రదేశాలను మూసేశారు.

అమెరికాలో 2018-19లో కీలక నిధుల బిల్లుకు ఆమోదం లభించక 35 రోజులపాటు అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌కు వెళ్లింది. అప్ప‌ట్లో కూడా డోనాల్డ్ ట్రంప్ అధ్య‌క్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో ఫెడరల్ ప్రభుత్వంలోని 2.1 మిలియన్ల ఉద్యోగులలో దాదాపు 8,00,000 మంది ప్రభావితమయ్యారు. అంతకుముందు 2013లో కొత్త ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌(Budget)ను కాంగ్రెస్ అంగీకరించకపోవడంతో ప్రభుత్వం 16 రోజులు షట్‌డౌన్ చేయబడింది.

అప్ప‌టి ష‌ట్‌డౌన్ కంటే ఈ సారి తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండొచ్చు అని అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌లు అభిప్రాయ‌ప‌డుతూ క‌థ‌నాలు వెల్ల‌డించాయి. ష‌ట్ డౌన్‌లో ఉన్న ప్రతివారం ఆర్థిక వృద్దిలో 0.1 నుంచి 0.2 పాయింట్లు తగ్గొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా చట్టసభసభ్యుల్లో రాజీ సూచనలు ప్ర‌స్తుతం కనిపించడం లేదు. అమెరికాలో షట్ డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పడం క‌ష్టమే. 1981 నుంచి అమెరికా ప్రభుత్వం 15 సార్లు ష‌ట్‌డౌన్ జ‌రిగింది. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు షట్ డౌన్ జ‌రిగింది.

Leave a Reply