Budget Session – దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే దేశ బడ్జెట్ః మోడీ
న్యూ డిల్లీ – దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే దేశ బడ్జెట్ ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు.. ఈ బడ్జెట్ లో యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు.. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు కానున్న సందర్భంగా మోడీ నేడు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నట్లు ఆకాంక్షించారు. “పేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కృప మనకు ఎప్పటికీ ఉండాలి. భారత శక్తి సామర్థ్యాలు మనకు విశేష గుర్తింపునిస్తాయి. మూడోసారి ఎన్డీఏకు ప్రజలు పట్టం కట్టారు. పార్లమెంట్లో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుంది” అని మోదీ పేర్కొన్నారు.