Buddhaprasad | ఆల‌యంలో స‌ల‌క సౌక‌ర్యాలు

Buddhaprasad | ఆల‌యంలో స‌ల‌క సౌక‌ర్యాలు

  • కాటేజీలు, మరిన్ని గదుల నిర్మాణానికి కృషి
  • ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
  • నూతన టేకు రథం తయారీని ప్రారంభించిన ఎమ్మెల్యే
  • రూ.కోటికి పైగా ఖర్చుతో టేకు రథం తయారీ చేపట్టిన సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు

Buddhaprasad | మోపిదేవి, ఆంధ్రప్రభ : మోపిదేవి పుణ్యక్షేత్రంలో కాటేజీలు, మరిన్ని గదుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఆదివారం మోపిదేవిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నూతన టేకురథం తయారీ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రముఖ సినీ నిర్మాత, దాత అట్లూరి నారాయణరావు దాదాపు రూ.కోటికి పైగా వ్యయంతో నూతన టేకు రథం తయారు చేయించటం అభినంద‌నీయ‌మ‌న్నారు.

Buddhaprasad

ఇప్పటికే హైదరాబాదుకు చెందిన ఆర్.వీ.ఎస్.చౌదరి రూ.కోటి వ్యయంతో స్వామివారి గర్భాలయానికి వెండి మండపం సమకూర్చటం శుభ పరిణామం అన్నారు. ప్రభుత్వం, దాతల సహకారంతో భక్తుల కోసం మరిన్ని సౌకర్యాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ రథం తయారీకి తనవంతు సహకారం అందిస్తున్నబీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజును అభినందించారు. దాతలు ముందుకు వస్తే దేవస్థానం మొత్తం సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. దేవస్థానంలో భక్తులకు నిత్య అన్నదాన భవనం నిర్మించేందుకు దాతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల కార్యనిర్వాహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావు, సూపరింటెండెంట్ అచ్యుత మధుసూద‌నరావు, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply