బీటీ రోడ్లు మంజూరు చేయాలని వినతి…
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) మోత్కూర్ మండలంలోని పాటిమట్ల నుండి సదర్శాపూర్, బుజిలాపురం గ్రామాలకు బీటీ రోడ్డు లేక ప్రజలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే ఈ బీటీ రోడ్లకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఓ ఎస్ డి విద్యాసాగర్ కి ఈ రోజు హైదరాబాద్ లో చేనేత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతి కుమార్కు వినతిపత్రం అందజేశారు.
పాటిమట్లలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనం నిర్మాణాని( building construction)కి రూ. 20 లక్షల నిధులు మంజూరై పనులు ప్రారంభించారని, కంట్రాక్టర్ పనులు ప్రారంభించి భవనం నిర్మాణం పూర్తి చేయకుండా నిలిపివేశారని, గత 5,6 అయిదారు నెలలుగా పనులు జరగడం లేదని దీంతో ప్రజలు వైద్య ఆరోగ్య విషయాలలో మోత్కూర్, తిర్మలగిరి వెళ్ళాల్సి వస్తున్నదని తక్షణమే సబ్ సెంటర్ భవనం పనులు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు.

