అవకాశం కల్పిస్తే అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తా

నస్పూర్, ఆంధ్రప్రభ ; అవకాశం కల్పిస్తే డివిజన్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తావని బీఎస్పీ పార్టీ మంచిర్యాల కార్పొరేషన్ 4వ వార్డ్ అభ్యర్థి సెట్టి ప్రవళిక ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. తనకు ఒక్కసారి అవకాశం కల్పించి కార్పొరేటర్ గా గెలిపిస్తే. ఈ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో తాము కృషి చేస్తామని, ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలు అందించేందుకు ముందజలో ఉంటామన్నారు. ఒక్క సారి గెలిపిస్తే 4వ డివిజన్ అభివృద్ధి బాధ్యతలు తామే తీసుకుంటాం అన్నారు. ప్రచారంలో బిఎస్పి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
