BSP Party | మున్సిపల్ బరిలో బహుజన సమాజ్ పార్టీ

BSP Party | మున్సిపల్ బరిలో బహుజన సమాజ్ పార్టీ

అన్ని వార్డుల్లో పోటీ చేస్తాం
మంథని నియోజకవర్గ ఇన్చార్జి జనగామ రవికుమార్

BSP Party | మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : మంథని మున్సిపల్ ఎన్నికల బరిలో బీఎస్పీ పార్టీ ఉంటుందని మంథని నియోజకవర్గ ఇన్చార్జి జనగామ రవికుమార్ స్పష్టం చేశారు. బుధవారం మంథని ప్రెస్ క్లబ్ లో బీ.ఎస్.పి పార్టీ మంథని నియోజకవర్గ ఇన్చార్జి జనగామ రవికుమార్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెహన్జి మాయావతి, రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ ఆదేశాల మేరకు మంథని మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల నుండి పోటీ చేస్తున్నామని ఆయన వివరించారు. త్వరలోనే విధివిధానాలను ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. పార్టీల్లో కొనసాగుతున్న సీనియర్లకు అవకాశం కల్పిస్తామని, కచ్చితంగా మంథని మున్సిపల్ ఎన్నికల్లో బీ.ఎస్.పి విజయం సాధించడానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

బహుజనులకు అధికారం రావాలంటే బీఎస్పీ పార్టీని ఆశీర్వదించాలని ఆయన కోరారు. బహుజనల తరఫున పోరాటం చేసే ఏకైక పార్టీ బీఎస్పీ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. సామాజిక న్యాయం జరగాలంటే బీఎస్పీ అభ్యర్థులను ఆశీర్వదించి మున్సిపల్ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పులిపాక బొంద్యాలు, రామగిరి మండల అధ్యక్షుడు రేణికుంట్ల మల్లేష్, మంథని నియోజకవర్గ కార్యదర్శి కోటపర్తి చంద్రశేఖర్, రామగిరి మండల ఉపాధ్యక్షుడు సదానందం, బీఎస్పీ జిల్లా ఇన్చార్జి పేగ నరేష్, నాయకులు సుదర్శన్, ఐదవ వార్డ్ అభ్యర్థి దాసరి కుమార్, రెండవవాడు అభ్యర్థి నూకల అరుణ్ , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply