హైదరాబాద్, ఆంధ్రప్రభ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP) భారత రాజ్యాంగాన్ని, సుప్రీం కోర్టు (Supreme Court) ఆదేశాలను గౌరవించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) అన్నారు. ఈ రోజు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ పోస్టు పెట్టారు. ఊహించినట్లుగానే వక్ఫ్ సవరణ చట్టం-2025 (Waqf Amendment Act-2025)పై సుప్రీం కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించడంతో కొంత మంది బీజేపీ భక్తులు కలవరపడ్డారని అన్నారు. వారు భారత రాజ్యాంగాన్ని గానీ, అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను గానీ గౌరవించరని ఎద్దేవా చేశారు. బీజేపీ నీచమైన వైఖరి ఎప్పుడు ఇలాగే ఉంటుందని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ కామెంట్…

