BRS | ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం..

BRS | ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం..

BRS, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించి గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం రాత్రి కొత్తగూడెం మునిసిపాలిటీ పరిధిలోని పాల్వంచ మండలం బొల్లూరుగూడెం కాలనీలో ఒకటో డివిజన్ అభ్యర్థి ఎచ్చెర్ల లక్ష్మీదేవి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో పాల్వంచ మండలాన్ని అభివృద్ధి చేసిన ఘనత తమదని పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి పార్టీ గుర్తించి టిక్కెట్లు ఇవ్వటం జరిగిందన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని.. ఇప్పటికీ కేసీఆర్ చేసిన అభివృద్ధి కనబడుతుందని గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి శూన్యమని గుర్తు చేశారు.

ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని.. కాంగ్రెస్ పరిపాలన పై ప్రజలు పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్నారని.. ఈ ఎన్నికల్లో నిరూపించే అవకాశం వచ్చిందన్నారు. తప్పకుండా తమ అభ్యర్థులు గెలుస్తారని.. ప్రతి ఒక్కరినీ ఆదరించి గెలిపించండి. అభివృద్ధి చేసే బాధ్యతగా తాము తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వనమా రాఘవ, నాయుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply