హైదరాబాద్ : ఊహించిన దానికంటే కూడా గొప్పగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరిగిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో నిర్వహించిన రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని తెలిపారు.
సభకు లక్షలాదిగా హాజరైన ప్రజలే కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పడానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. సభ విజయవంతం కావడానికి కృషి చేసిన జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇంఛార్జిలు, కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు, మాజీ కార్పొరేటర్ లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందనలు తెలిపారు.