BRS Party | రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా కేసీఆర్ ప్రసంగం

ఎల్కతుర్తి – బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో గంట పాటు ప్రసంగించిన కెసిఆర్ తన ప్రసంగంలో ఎక్కడా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతల పేర్లను ప్రస్తావించకపోవడం గమనార్హం. కేసీఆర్ వ్యూహాత్మకంగానే ఏ ఒక్క కాంగ్రెస్ నేత పేరు కూడా ప్రస్తావించలేదన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.

సెటైర్ లతో..

కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారని కేసీఆర్ ధ్వజమెత్తారు. మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించారని కేసీఆర్ మండిపడ్డారు..

మొగోడు అని మొలక అలికేందుకు పిలిస్తే.. ఎలుక పిల్లను చూసి ఎల్లెలకల పడ్డడట.. అని కేసీఆర్ విమర్శించారు. . .చాలా సిపాయిలం.. మా అంతా సియిపాలు లేరంటే నమ్మి బోల్తా పడ్డాం.. గల్లంతు అయ్యాం.. ఒక ఊరిలో నాట్లు వేసే టైమ్ వస్తే వడ్లు అలులకుతున్నడు ఓ రైతు. మొలకకు అలుకుడు చేస్తం కదా.. తుకాలు పోయమా..? పెద్ద మొగోడు అని ఒకర్ని పిలిచిండ్రట.

మొగోడు అని మొలక అలికేందుకు పిలిస్తే.. ఎలుక పిల్లను చూసి ఎల్లెలకల పడ్డట. ఇక మా అంత సిపాయిలు లేరు.. మేం తెచ్చే ఇస్తాం.. ఆరు చందమామలు.. ఏడు సూర్యుళ్లు పెడుతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి, మంచిగున్న తెలంగాణను ఆగం పట్టించి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం, దగా చేశారు.

ఈ మాట వాస్తవం. ఇవాళ మమ్మల్ని నమ్ముతలేరు.. అప్పు పుడుతలేదని మాట్లాడుతుండ్రు. ఎక్కడికెళ్లి తెచ్చి చేయాలని అంటున్నరు. అపారమైన అనుభవం ఉందని అప్పుడు అన్నరు.. ఇప్పుడేమో ఎల్లెలకల పడుతుండ్రు. నా ప్రసంగం టీవీల్లో వినే కోట్లాను కోట్ల మందికి విన్నవిస్తున్నా.. ఇంత మోసం ఉంటదా.. ఇంత దగా ఉంటదా.. ఎంత వరకు ఇది కరెక్ట్.. తెలంగాణను ఇప్పుడు బొందల పడగొట్టిండ్రు.. ఎంత ఘోరమైన ఫలితం చూస్తున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు..

నయవంచక ప్రభుత్వం ..

ఇవాళ కాంగ్రెస్‌ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్‌. మంచినీళ్లు ఇవ్వడంలో ఫెయిల్‌. సాగుకు నీరివ్వడంలో ఫెయిల్‌. కరెంటు సరఫరాలో ఫెయిల్‌. రైతుబంధు ఇవ్వడంలో ఫెయిల్‌. విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఫెయిల్‌. ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్‌. పల్లెలు, పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్‌. భూముల ధరలు పెంచడంలో ఫెయిల్‌. మరి దేంట్లో పాస్‌ అయ్యారు? ఎటుపడితే అటు ఒర్రుడు.. దేవుండ్లపై ఒట్లుపెట్టుడు.. అబద్ధపు వాగ్ధానాలు చేసుడు..

20-30శాతం కమీషన్లు తీసుకునుడు.. సంచులు నింపుడు.. సంచులు మోసుడు అంతేనా? ఈ మాట కరెక్టేనా? అన్నింట్లో ఈ ప్రభుత్వం ఫెయిల్‌ అయ్యిందా? అంటే.. ఫెయిల్‌ అంటూ జనాలు నినదించారు. 20-30శాతం కమీషన్ల మాట నేను అంటలేను. ఎవరు అన్నరు.. స్వయంగా ఆర్థికశాఖ మంత్రి చాంబర్‌కు వెళ్లి 200 మంది కాంట్రాక్టర్లు పోయి లొల్లిపెట్టి.. మమ్మల్ని 20-30శాతం కమీషన్లు అడుగుతున్నరు.. ఇదేం అన్యాయం అని చెప్పి అడిగిన మాటనే నేను చెబుతున్న’నన్నారు.

పోగొట్టుకున్న చోటనే వెతుక్కోవాలి.

.’మాజీ సర్పంచులు పని చేశాం బిల్లులు ఇవ్వమంటే వాళ్లను గోసపుచ్చుకుంటున్నరు. వాళ్లేం పాపం చేశారు? ఘోరం ఈ అందానికి ఏం మాట్లాడుతరు.. కేసీఆర్‌ నువ్వు రా అసెంబ్లీకి అంటున్నరు. దేనికి రావాలి మీ ముచ్చట్లు వినడానికా? పిల్లలు అడిగితే మీరు జవాబు చెప్తలేరు. ఉన్నది ఉన్నట్లు నిలబెడితే ఆ ఆర్థికమంత్రి అసెంబ్లీలో నిలబడి.. భుజాలు తడుముకుంటున్నడు.

నీకెందుకయ్యా బాధా? నువ్వు తీసుకుంటెనే నీకు బాధ ఉండాలి కదా? లేచి పెద్ద లొల్లి పెడుతున్నడు అసెంబ్లీలో. ఈ విధంగా చాలా గందరగోళంగా, అవివేకంతో, అజ్ఞానంతో అడ్డగోలు మాటలు చెప్పారు. దాంతో మనం కూడ గోల్‌మాల్‌ అయిపోయాం. తీర్థం పోదాం తిమ్మక్క అంటే.. వాగు గుళ్లే.. మనం సల్లే.. ఇవాళ ప్రజలను ఆ గతికి తీసుకువచ్చారు. మరి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఆవేశం కాదు.

గాడిదలకు గడ్డేసి.. బర్లకు పాలు పిండితే వస్తయా? మరి ఏం చేయాలో ఆలోచించాలి. ఓ తమ్ముడు అన్నడు హైదరాబాద్‌లో ఆయన ఇళ్లు కూలగొడితే.. కేసీఆర్‌ అన్న యాడున్నవ్‌ నువ్వు రావాలి.. కత్తి వాడితో చేతిలో పెట్టి యుద్ధం నన్ను చేయమనవడితివి అంతేనా? దీన్ని కూడా ప్రజలు విచారించాలి. మీకు అర్థం కావాలనే ఇది చెబుతున్న. పోడగొట్టుకున్న కాడనే వెతుక్కోవాలి. మీ వెంట బీఆర్‌ఎస్‌ ఉంటది.. కేసీఆర్‌ ఉంటడు. వందశాతం మళ్లీ తెలంగాణలో విజయం సాధించాలి.. గులాబీ జెండా ఎగురవేయాలి.. అద్భుతమైన తెలంగాణను సాధించాలి’ అని పిలుపునిచ్చారు కేసీఆర్‌.

Leave a Reply