గుడిగండ్లలో జోరుగా బీఆర్ఎస్ నేతల ఇంటింటి ప్రచారం

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని గుడిగండ్ల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పెద్ద నరసింహులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం జోరుగా సాగింది.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి. నరసింహ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థి నిజాయితీపరుడు, గ్రామాభివృద్ధి పట్ల కట్టుబడి ఉన్న వ్యక్తి అని పేర్కొంటూ, ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాల‌ని గ్రామస్తులను కోరారు.

గ్రామ అభివృద్ధి, ప్రాథమిక సౌకర్యాల మెరుగుదల కోసం ప్రజలు ఏకమై అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులు ఇంటింటి ప్రచారంలో పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి పెద్ద నరసింహులు, బీఆర్ఎస్ నాయకులు నర్సిరెడ్డి, కిష్టప్ప, రాము, వెంకటేశ్వర రెడ్డి, హనుమంతు, నారాయణ, బాలప్ప, శ్రీనివాసులు, శివలింగప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply