వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్నమాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు (Harish Rao) కు ఎన్నారై బీఆర్ఎస్ శ్రేణులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. లండ‌న్ (London) లోని హీత్రూ ఎయిర్‌పోర్టులో ఎన్నారై బీఆర్ఎస్ నాయకులతో హ‌రీశ్‌రావు కాసేపు ముచ్చటించారు. మళ్లీ అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని కలుసుకుందామని తెలిపినట్లు ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి (Naveen Reddy) తెలిపారు.

హ‌రీశ్‌రావు(Harish Rao) కు స్వాగ‌తం ప‌లికిన వారిలో ఎన్నారై బీఆర్ఎస్ (BRS) సెల్ యూకే అధ్యక్షులు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, రవి రేటినేని, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, మాజీ అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, అడ్వైజ‌రీ బోర్డు చైర్మన్ సీక చంద్రశేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్లా, గణేష్ కుప్పాల, సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ రవి పులుసు, సురేష్ బుడగం, ప్రశాంత్ మామిడాల, అంజన్ రావు, అబ్దుల్, తరుణ్ లునావత్, పవన్ గౌడ్, త‌దిత‌రులున్నారు.

Leave a Reply