Kalvakuntla Kavitha | కంటతడి పెట్టిన కవిత…

Kalvakuntla Kavitha | కంటతడి పెట్టిన కవిత…

శాసనమండలిలో భావోద్వేగం
రాజీనామాపై కవిత పునరాలోచించాలి… ఛైర్మన్ గుత్తా
పునరాలోచన లేదు…రాజీనామాను ఆమోదించండి… కవిత


Kalvakuntla Kavitha | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ శాసనమండలి (Telangana Legislative Council)లో భావోద్వేగ దృశ్యం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కంటతడి పెట్టుకుని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మరోసారి రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఈ ఘటన సభలో ఉద్వేగభరిత వాతావరణాన్ని సృష్టించింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు బీఆర్ఎస్ (BRS) లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని అనేక ఆంక్షల మధ్య పని చేయాల్సి వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్‍లో ప్రశ్నిస్తున్న తనను అణగదొక్కారని తన రాజకీయ ప్రస్తానాన్ని వివరిస్తూ నిండు సభలోనే కన్నీరు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ ఏ నాడు నాకు మద్దతుగా నిలవలేదని, బీఆర్ఎస్ చానల్, పేపర్ ఏనాడు త‌నకు సపోర్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదని, ఏనాడు టికెట్ కోసం అడుక్కోలేదన్నారు. బీఆర్ఎస్ వస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని పని చేశానన్నారు.

Leave a Reply