జూబ్లీహిల్స్ రణరంగంలో..

జూబ్లీహిల్స్ రణరంగంలో..

మాగంటి సునీతమ్మకి జై కొడుతున్న జూబ్లీహిల్స్ ప్రజానీకం


రహమాత్ నగర్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఈరోజు రహమత్ నగర్ డివిజన్ లో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ (Maganti Sunitha Gopinath) ఇంటింటి ప్రచారం చేశారు.

మా నాయకుడు గోపన్న చేసిన అభివృద్ధి, సహాయం ఎన్నటికీ మరువలేనిదని, తను మరణించే వరకు కూడా మాతోనే ఉన్నారని, ఆ నాయకుడి కుటుంబానికి మేమంతా తోడుగా ఉండి జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో సునీతమ్మను గెలిపించుకుని, వారిలో మా గోపన్నను చూసుకుంటామని స్థానిక ప్రజలు ధీమా వ్యక్తం చేశారు.

వారితో పాటు నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ జెడ్పి చైర్పర్సన్ తుల ఉమా, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా, మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత, స్థానిక నాయకులు, మహిళలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply