12వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి సునీత ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మోర్తల సునీతా రమణారెడ్డి శుక్రవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెడుతూ, ఓటర్లను కలుసుకుంటూ తాను చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారాన్ని జరిపారు. కౌన్సిలర్ గా గెలిపించి ఆశీర్వదిస్తే ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
