12 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మోర్తల సునీత రమణారెడ్డి ప్రచారం..

12 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మోర్తల సునీత రమణారెడ్డి ప్రచారం..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 12 వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి మోర్తల సునీత రమణారెడ్డి ప్రచారపు చివరి రోజైన సోమవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డు సమగ్ర అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని ఓటర్లకు ఆమె హామీ ఇచ్చారు. కౌన్సిలర్ గా తనని గెలిపించి ఆశీర్వదిస్తే వార్డును మున్సిపల్ పరిధిలోని అభివృద్ధి పనులలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
