బి ఆర్ ఎస్ భారీ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలి

బి ఆర్ ఎస్ భారీ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలి

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కుర్ మున్సిపల్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ రేపు మధ్యాహ్నం 1 గంటకు జరిగే భారీ బైక్ ర్యాలీ ని విజయవంతం చేయాలని బి ఆర్ ఎస్ పార్టీ మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ నేవూరి ధర్మెందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మోత్కూర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ర్యాలీకి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ లు హాజరువుతున్నారన్నారు.

ఈ సందర్బంగా ఇంచార్జ్ ధర్మేంధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని , కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేసి బి ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పొన్నేబోయిన రమేష్,జంగ శ్రీను, మాజీ మార్కెట్ చైర్మన్ లు కె యాకుబ్ రెడ్డి, చిప్పలపల్లి మహేంద్రనాధ్, రాష్ట్ర నాయకులు రచ్చ లక్ష్మినర్సింహా రెడ్డి,సీపీఎం నాయకులు మాటూరి బాలరాజు, బొల్లు యాదగిరి, మోత్కూర్ , అడ్డగూడూర్ సీపీఎం మండల కార్యదర్శులు గుండు నెంకటనర్సు, బుర్రు అనిల్, అడ్డగూడూర్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి గజ్జిమల్లేష్, పానుగుల్ల విష్ణుమూర్తి, నాయకులు పూలపెల్లి జనర్దన్ రెడ్డి, వెలుగు సోమయ్య, ఎలందర్, బండి వెంకటేష్ , పొన్నేబోయిన మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply