BRS | బీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే….

BRS | బీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకే….

BRS | నెల్లికుదురు, ఆంధ్రప్రభ : నెల్లికుదురు మండలంలోని రామన్నగూడెంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బండి శ్రీనివాస్ గెలుపు నల్లేరు మీద నడకేనని కాసం లక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్ రెడ్డిలు అన్నారు. గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్పా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి నేటి వరకు గ్రామానికి చేసిందేమీ లేదన్నారు. గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

గ్రామ సర్పంచ్ అభ్యర్థగా బండి శ్రీనివాస్ ను అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లలో గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు. గ్రామంలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ఎలాంటి లోటు రాకుండా నిత్యం గ్రామంలోనే వుంటూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానన్నారు. తనతో పాటు, అన్ని వార్డుల అభ్యర్థులను అధిక మెజారిటితో గెలిపించాలని ప్రజలను కోరారు.

Leave a Reply