Brs l గెలుపు వాకిట్లో రాజు గౌడ్…

Brs l గెలుపు వాకిట్లో రాజు గౌడ్…
భారీ విజయం పక్క అని చర్చ
అడుగడుగునా నీరాజనం పలుకుతున్న ప్రజానీకం
Brs l మంథని ఆంధ్రప్రభ: సింగిల్ విండో మాజీ డైరెక్టర్ మాచిడి రాజు గౌడ్ బరిలో ఉంటే గెలుపు పక్క అని మూడవ వార్డు ప్రజలు చర్చించుకుంటున్నారు. మంథని మున్సిపల్ పరిధిలో మూడవ వార్డ్ నుండి మాచిడి రాజు గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. అడుగడుగునా ఆయన ప్రచారానికి ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటెయ్యండి. ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవకుడిలా పని చేస్తానని ఆయన ప్రచారంలో పేర్కొన్నారు. ఏకంగా వార్డు ప్రజలతో కలిసి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ రాజు గౌడ్ తరఫున ప్రచారాన్ని విస్తృతం చేశారు. ప్రచారంలో అందరికంటే ముందు దూసుకవెళ్తున్నారు. మోసపోవద్దు గోసపడతాం అని నిదానంతో ముమ్మరంగా గడపగడపకు ప్రచారం చేస్తున్నారు. గతంలో ప్రజల కోసం విశేషంగా సేవ చేశారని మరోసారి అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
గడపగడపకు ప్రచారం చేస్తూ ఆత్మీయంగా పలకరిస్తూ ఓటర్ల మనసును గెలుచుకుంటున్నారు. విశ్లేషకుల అంచనాల ప్రకారం మూడవ వార్డులో మాజీ సింగిల్ విండో డైరెక్టర్ మాచిడి రాజు గౌడ్ ఘనవిజయం సాధించడం ఖాయం. ఇప్పుడు కేవలం మెజార్టీ ఎంత అనేది చర్చనీయంగా మారింది. గెలిచిన తర్వాత పాలకుడిగా కాకుండా సేవకుడిగా పరిపాలన అందజేస్తానని ఆయన తెలిపారు. మూడవ వార్డులో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. పారిశుద్ధ నిర్వాహణ, సురక్షితమైన మంచినీటి సరఫరా, పట్టణ ప్రగతి కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. వార్డులోని ప్రజల సమస్యలు తెలుసుకొని యుద్ద ప్రాతిపదికన పరిష్కరించడానికి కార్యచరణ చేపడతానని ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటెయ్యాలని ఆయన కోరారు.
