BRS | బడా భీమ్‌గల్ గ్రామాభివృద్ధే ధ్యేయం
BRS | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : బడా భీమ్‌గల్ గ్రామాభివృద్ధే ధ్యేయంగా పోటీ చేస్తున్నట్లు బీఆర్ఎస్ (BRS) మద్దతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థి రాచకొండ విష్ణువర్థిని శంకర్ గౌడ్ అన్నారు. ఈ రోజు ఆమె నామినేషన్ వేస్తున్న సందర్భంగా మాట్లాడారు. తాను బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్నానని, తాను సర్పంచ్ గా ఎన్నికైతే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. తనకు గ్రామంలో ఉన్న మహిళలు, యువకులు, అభిమానులు మద్దతు ఉందని అన్నారు. తాను విజయం సాధిస్తానని అన్నారు. ప్రతి ఒక్కరూ తనకు ఓటు వేసి గ్రామ అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

