BRS | డివిజన్ అభివృద్ధి కోసమే పోటీలో….

BRS | డివిజన్ అభివృద్ధి కోసమే పోటీలో….

BRS | మంచిర్యాల సిటీ, ఆంధ్రప్రభ : 59వ డివిజన్లో మోసపూరిత కాంగ్రెస్ ఓడించడమే గుణపాఠం గా ఉంటుందని ప్రజల‌దిశగానే లోచిస్తున్నారని, 6 గ్యారంటీలు 420 హామీలు అంతా బూటకమే రుజువైందని, రెండేళ్లలో మాటలే గారడి తప్ప చేసింది ఏమి లేదు ప్రజలకు స్పష్టత వచ్చిందని, మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్ల బీఆర్ ఎస్ పాలనే ప్రజలు కోరుకుంటున్నారు అని, దివాకర్ రావు విజిత్ రావు విజన్ ఉన్న నేతలు అభివృద్ధి సంక్షేమ ఆలోచిస్తారే తప్ప మంచి మంచిర్యాలను మరింత వృద్ధిలోకి తేవాలన్న తాపత్రమే తమ నేతల్లో ఉంటుంది తప్ప బెదిరింపులు మాఫియా ఆగడాలు వారికి చేతగావు అని డివిజన్ అభివృద్ధి కోసమే పోటీలో ఉన్నానని నిండుగా మెండుగా ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం తమకే ఉంటుందని గులాబీ పార్టీని బలపరుస్తారని, 59వ డివిజన్ మాజీ కౌన్సిలర్ చంద్రశేఖర్ ​ స్పష్టం చేశారు.

డివిజన్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి నగర పాలక సంస్థ లో గళం విప్పి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. నూతన రోడ్లు, డ్రైనేజీలు, రోడ్ల మరమ్మత్తులు, ఇంటి పర్మిషన్లు ప్రజలకు సౌకర్యవంతంగా అందేలా చూడడం తమ కర్తవ్యం అన్నారు. సతీమణి సుగుణ హండే సైతం మాజీ కౌన్సిలర్ కావడంతో ఒక ఓటుతో డివిజన్ ప్రజలకు ఇద్దరు సేవకులుగా పనిచేస్తామన్నారు. డివిజన్లో తలెత్తే ప్రతి సమస్యను మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు రాష్ట్ర నాయకులు విజిత్ రావు చర్చించి పరిష్కారం చేసే విధంగా ముందుకు సాగుతామన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించి ప్రజాబలం పొందడమే తమ బాధ్యత అన్నారు. పోటీలో కాంగ్రెస్, బీజేపీ ఉన్నప్పటికీ వారి మోసపూరిత వాగ్దానాలతో ప్రజలు ఆ పార్టీలకు చెంపపెట్టున ఓటమిని గులాబీ పార్టీకి పట్టం కట్టడం కాయంగా చంద్రశేఖర్​ హండే స్పష్టం చేశారు.

Leave a Reply