ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) మండి జిల్లాలోని సుందర్‌నగర్(Sundarnagar)లో జరిగిన కొండచరియలు(Landslides) విరిగిపడటం వల్ల మరణాల(of deaths) సంఖ్య 6కు చేరిందని, మూడు అదనపు మృతదేహాలు శిథిలాల(Ruins) నుంచి సేకరించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఒక రోజు ముందు, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలోని సుందర్‌నగర్ పట్టణంలో కొండచరియలు విరిగిపడటంతో రెండు ఇళ్లులు శిథిలాల కింద ఉండిపోయాయి.
కొండచరియలు సంభవించిన వెంటనే, భారత సైన్యం(Indian Army), జాతీయ విపత్తు స్పందన బృందం(National Disaster Response Team), రాష్ట్ర విపత్తు స్పందన బృందం(State Disaster Response Team) రక్షణ కార్యకలాపాలను కొనసాగించాయి. రెండు ఇళ్లు శిథిలాల కింద చిక్కుకోవడంతో రక్షణ బృందాలు మూడు మృతదేహాల(Three dead bodies)ను బయటకు వెలికితీశాయి. అయితే మూడు మంది గల్లంతైన వ్యక్తుల కోసం శోధన కార్యకలాపాలు కొనసాగుతున్నాయని మండి డిప్యూటీ కమిషనర్ అపూర్వ్ దేవ్‌గన్(Deputy Commissioner Apurv Devgan)తెలిపారు. సుందర్‌నగర్‌లో మంగళవారం సాయంత్రం ఆకస్మత్తుగా కొండచరియు విరిగిపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఒక ఇంటిలో నలుగురు వ్యక్తులు ఉన్నారు, వారిలో ఒక మహిళ, ఒక బాలుడుని బయటకు తీశారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కానీ వారు బతకలేదు. రెండవ ఇంటిలో ఒక మృతదేహం సేకరించారు.
స్థానికుల ప్రకారం.. కొండచరియు(Hillside)మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో సంభవించింది. ఎన్‌డిఆర్‌ఎఫ్ జిల్లా యంత్రాంగం బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకఉని గాలింపు చర్యలు చేపట్టారు. సుందర్‌నగర్ ఎమ్మెల్యే రాకేష్ జమ్వాల్ మాట్లాడుతూ..రెండు ఇళ్లలో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలు బయటకు తీసినట్లు వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు ఇంకా శిథిలాల్లో చిక్కుకున్నారని వారి కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ జిల్లా యంత్రాంగం బృందం(NDRF District Administration Team) గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు.