ఘనంగా రాంజీ గొండ్ వర్థంతి వేడుకలు…

ఘనంగా రాంజీ గొండ్ వర్థంతి వేడుకలు…

దండేపల్లి, ఆంధ్రప్రభ : ఆదివాసులకు పోరాట పంథా నేర్పిన గోండు వీరుడు, బ్రిటిష్ సైన్యంపై గెరిల్లా పోరాటం చేసి అమరవీరుడైన ఆదివాసి బిడ్డ రాంజీ గోండుకు గురువారం దండేపల్లి మండలంలోని కుందేల్ పహాడ్, తానిమడుగు లో అదివాసి సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,రాంజీ గోండు, నాందేడ్ బ్రిటిష్ రెజిమెంట్ పై మెరుపు దాడులు చేసి మహారాష్ట్రలోని చంద్రపూర్ కేంద్రంగా ప్రత్యేక సైన్యాన్ని నడిపిన రాంజీ గోండుతో పాటు వెయ్యి మందిని నిర్మల్ సమీపంలోని వేయి ఉరుల మర్రి చెట్టుకు ఉరేసి చంపిన చరిత్ర ఇంకా చెరిగిపోలేదని. అలాంటి ధీరత్వాన్ని ప్రదర్శించిన రాంజీ గోండునుస్మరిస్తూ ఆయన వర్ధంతిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో, మంచిర్యాల జిల్లా రాజ్ గోండు సేవ సమితి అధ్యక్షుడు కొమురం శంకర్, గ్రామ పటేల్ కొమురం అనంతుగ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply