హైదరాబద్ : నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీ, కృష్ణానగర్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. కాగా, ఈ రోజు నుంచి మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.