ఝార్ఖండ్ లో సాయుధబలగాలకు, నక్స్ లైట్లకు మధ్య నేడు జరిగిన ఎన్ కౌంటర్ లో కీలక నేతతో సహా ఎనిమదిమంది మృత్యువాత పడ్డారు.. బోకోరో జిల్లా లాల్ పానియా గ్రామం సమీపంలోని లుగు హిల్స్ వద్ద భద్రతాబలగాలు కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో నక్స్ ల్స్ నుంచి కాల్పులు ప్రారంభమయ్యాయి.. దీంతో భద్రతా బలగాలు ధీటుగా స్పందించాయి. కోబ్రో సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో మావోయిస్ట్ కీలక నేత వివేక్ హతమయ్యాడు.. ఆయన తలపై కోటి రూపాయిల రివార్డ్ ఉంది.. ఆయనతో పాటు మరో ఏడుగురు కూడా నేలకు ఒరిగారు.. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో భారీగా ఆర్మీ దళాలు ఆయుదాలను, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు..
Breaking News | ఝార్ఖండ్ లో ఎన్ కౌంటర్ – కీలకనేతతో సహా ఎనిమిది మంది మరణం
