హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య సమస్యల కారణంగా వైద్య పరీక్షల కోసం ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
ఆసుపత్రికి చేరుకున్న తర్వాత వైద్యులు కేసీఆర్ కు పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఆయన రెగ్యులర్ చెకప్ కోసం వచ్చారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కేసీఆర్ ఆసుపత్రిలో చేరారనే వార్త బయటకు రావడంతో గులాబీ పార్టీ శ్రేణుల్లో కొంత ఆందోళన నెలకొంది.