- పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు..
హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) క్యాంపస్‌లో జూలై 31వ తేదీన భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో Retail Industryలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా విద్యార్థులకు నెలకు కనీసం రూ.7,000 నుంచి రూ.24,000 వరకు స్టైఫండ్ (జీతం) రూపంలో ఆదాయం లభించనుంది.
ఈ జాబ్ మేళా RASCI స్టైపెండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద నిర్వహిస్తున్నారు. B.A, B.Com, B.Sc కోర్సుల మొదటి సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులు, అలాగే రెండవ లేదా మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా పాల్గొనవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు BRAOU అధికారిక వెబ్సైట్ www.braou.ac.in ద్వారా ముందుగా నమోదు చేసుకోవచ్చు. అలాగే, నేరుగా వాక్-ఇన్ విధానంలో హాజరయ్యే అవకాశం కూడా కల్పించారు.
ఈ జాబ్ మేళా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 46, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని అకడమిక్ బిల్డింగ్‌లో జరుగుతుంది.
డిగ్రీతో పాటు పని అనుభవం, ఆదాయం పొందేందుకు విద్యార్థులకు ఇది అరుదైన అవకాశం. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశ్వవిద్యాలయ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.