అమ్రాబాద్ : ఎస్ ఎల్ బి సి టన్నెల్ పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్ బృందానికి బ్రేకులు పడ్డాయి.. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు వద్దకు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు పలువురు నేతలు నేటి మధ్యాహ్నం అక్కడికి చేరుకున్నారు. అయితే సొరంగంలోకి వెళ్లనీయకుండా హరీశ్‌రావు బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో హరీశ్‌రావు, ఇతర నాయకులు రోడ్డుపైనే బైఠాయించిన నిరసన తెలిపారు. పోలీసుల తీరుపై హరీశ్‌రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు.. పరిస్థితిని చూసేందుకే వచ్చామని, రాజకీయం చేయడం కోసం కాదని బీఆర్ఎస్ నేతలు వివరించారు.. అయినప్పటికీ సొరంగంలోకి అనుమతించేది లేదని పోలీసులు, ఇతర అధికారులు చెప్పారు.. లోపల సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఈ సమయంలో లోపలికి వెళితే వాటికి ఆటంకం కలుగుతుందని నేతలకు చెప్పారు పోలీసులు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నేతల ఒత్తిడితో 10మందిని చివరకు లోపలికి అనుమతించారు.