Brahmotsavam | రమణీయం..

పడమటి అంజన్న చక్రతీర్థం స్నానం
పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు


Brahmotsavam | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వెలసిన‌ శ్రీ పడమటి ఆంజనేయ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) భాగంగా శనివారం స్వామివారికి చక్రతీర్థ స్నానం నిర్వహించారు. మార్గశిర బహుళ విదియ సందర్భంగా స్వామివారికి ఆలయ ధర్మకర్త పి.ప్రాణేశాచారి ఆధ్వర్యంలో విద్వాన్ రాఘవేంద్ర చార్య వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య చక్రతీర్థం స్థానం నిర్వహించారు. గతంలో దేవాలయంలోనే స్వామి వారికి చక్రతీర్థ స్నానం జరిపించేవారు.

కాగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి (Minister Dr. Vakiti Srihari) ప్రత్యేక చొరవ తీసుకొని తన సొంత ఖర్చుతో దశాబ్దాలుగా పాడుబడిన కోనేటిని పునరుద్ధరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మొదటిసారి పుష్కరిణి (కోనేటి)లో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి చక్రతీర్థ స్థానం వేడుకలను రమనీయంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై కోనేటిలో అంజన్న స్వామి చక్రతీర్థ స్నానం వేడుకలను తిలకించి తరించారు. భక్తి గేయాలు భజనల మధ్య ఆద్యంతం చక్రతీర్థ స్నానం వేడుక రమణీయంగా సాగింది.

పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులను ఉద్దేశించి ఆలయ ధర్మకర్త ప్రాణేశాచారి మాట్లాడుతూ.. శనిదోష, అపమృత్యు దోష పరిహారకుడు జాంబవంతుల వారిచే ప్రతిష్టింపబడిన శ్రీ శ్రీ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి (Anjaneya Swamy) వారి అనుగ్రహం ఈ ప్రాంత ప్రజలపై ఉండాలన్నారు. స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు చక్ర తీర్థం స్థానం నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారిని మండలం రోజులపాటు సేవించిన ఎడల పుత్రర్థులకు పుత్రులను యశార్థులకు కీర్తిని విద్యార్థులకు విద్యను ప్రసాదిస్తారన్నారు. స్వామి వారిని సేవించిన భక్తులకు ఎల్లవేళలా స్వామివారి అభయం లభిస్తుందన్నారు. భక్తితో కొలిచే వారి పాలిట కొంగుబంగారమై స్వామి వారు భక్తులకు ఎళ్లవేలలో అండగా ఉంటారన్నారు.

స్వామివారిని నిత్యం దర్శించుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కవిత, అర్చకులు అరవింద చారి, బ్రాహ్మణ పరిషత్ సభ్యులు మాన్వి రామారావు, డివి.చారి, సురేంద్ర చారి, విద్యాసాగర్, దేవాదాయ శాఖ సిబ్బంది సత్యనారాయణ, ఆంజనేయులు, కుమ్మరి శ్రీనివాస్, రజనీకాంత్, భక్తులు పాల్గొన్నారు. ఇంతకు ముందు స్వామివారి ఆలయంలో హనుమాన్ అష్టక హోమం నిర్వహించారు.

Leave a Reply