BrahmaAnandam ట్రైలర్ రిలీజ్..
కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బ్రహ్మానందం’. ఈ సినిమాకి ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం నిర్వహించగా.. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. అయితే ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకాభిమానుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో గౌతమ్ రాజా ‘బ్రహ్మానందం’గా నటిస్తుండగా, బ్రహ్మానందం తాతగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా ఈ నెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది.