Boxing Championship | బాక్సింగ్ పోటీల్లో బంగారు పథకం..
- సాధించిన గాంధారి క్రీడాకారుడు..
- బంగారు పతకాన్ని సాధించిన అర్జున్ గజానంద్ దేశముఖ్
Boxing Championship | గాంధారి, ఆంధ్రప్రభ : హైదరాబాద్ లో జరిగిన బాక్సింగ్ పోటీల్లో గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి అర్జున్ గజానంద్ దేశముఖ్ బంగారు పథకాన్ని సాధించినట్లు తెలిపారు. ఈనెల ఈనెల 28న హైదరాబాదులోని పూల్ బాగ్ కమాన్ సమీపంలోని జిహెచ్ఎంసి గ్రౌండ్ లో జరిగిన శివాజీ మహారాజ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్(Boxing Championship) పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు.
ఈ పోటీల్లో 65 కిలోల విభాగంలో పాల్గొన్న అర్జున్ గజానంద్(Arjun Gajanand) అద్భుత ప్రతిభను కనబరిచి, ఫైనల్ మ్యాచ్ లో గెలిచి బంగారు పథకాన్ని సాధించినట్లు తెలిపారు. అర్జున్ గజానంద్ గత నెలలో ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో సైతం వెండి పథకాన్ని సాధించినట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో రాణిస్తున్న అర్జున్, హైదరాబాద్ లోని భాను ప్రసాద్ అనే కోచ్ వద్ద ప్రత్యేక శిక్షణ(Special Training) తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
భవిష్యత్తులో దేశం తరఫున అంతర్జాతీయ స్థాయిలో పథకాలు(Schemes) తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు క్రీడాకారుడు తెలిపారు. గాంధారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అర్జున్ గజానంద్ ను, గాంధారి మండల మాజీ జెడ్పీటీసీ తానాజీరావుతో పాటు, కళాశాల ప్రిన్సిపాల్ గడ్డం గంగారం అభినందించారు.

