మీరు దేవుడి గూరించి చెప్పడం హస్యాస్పదం..

మీరు దేవుడి గూరించి చెప్పడం హస్యాస్పదం..
భక్తి కంటే టీడీపీకి రాజకీయమే ఎక్కవ
మీకు దమ్ముంటే సిట్ నివేదికను బయట పెట్టండి
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః టిడిపికి భక్తి కంటే రాజకీయమే ఎక్కువైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మీ దాన దాహం కోసం తిరుమల లడ్డు కల్తీ జరిగిందంటూ అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. మీకు దమ్ముంటే సిట్ పూర్తి నివేదికను బయట పెట్టాలని సవాల్ విసిరారు. కల్తీ లడ్డు వ్యవహారంపై ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు మీరు పారిపోవచ్చు కానీ ఆ దేవుడు మిమ్మల్ని క్షమించారు. చర్చలు జరిగితే హెరిటేజ్ నిజాలు బయటపడతాయని భయపడుతున్నారు.
ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ కు సంబంధం లేదా అని ప్రశ్నించారు. శాసనమండలిలో కల్తిపై అన్ని అబద్ధాలు చెప్పారని సత్యనారాయణ పేర్కొన్నారు. 2016 లో హెరిటేజ్ మజ్జిగ ప్రభుత్వానికి సంపరా చేయలేదా, పుష్కరాల పేరుతో విజయవాడలో ఎన్ని దేవాలయాలు కూల్చారు, అలాంటి మీరు మాకు దేవాలయాల గురించి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైసీిపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.
