ఇద్దరికి తీవ్ర గాయాలు

ఇద్దరికి తీవ్ర గాయాలు
సుల్తానాబాద్ ఆంధ్రప్రభ: రైస్ మిల్లులోని బాయిలర్ పేలిన ప్రమాదం లో ఇద్దరు కార్మికులు గాయపడిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి లోని కనకదుర్గ మిల్లులో బుధవారం చోటు చేసుకుంది. బాయిలర్ ఒక్క సారిగా పేలి పోవడం తో కోటికి రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదం లో ఇద్దరు కార్మికులు కుమార్, రామస్వామి లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
