Book launch |శ్రీ పడమటి ఆంజనేయస్వామి చరిత్ర పుస్తకావిష్కరణ

Book launch | శ్రీ పడమటి ఆంజనేయస్వామి చరిత్ర పుస్తకావిష్కరణ

  • పాల్గొన్న మంత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రముఖులు

Book launch | మక్తల్, ఆంధ్రప్రభ : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ పడమటి ఆంజనేయస్వామి (Anjaneyaswamy) ఆలయ చరిత్ర పుస్తకావిష్కరణ వేడుకలు ఆదివారం స్వామివారి దేవాలయంలో వైభవంగా (gloriously) నిర్వహించారు. స్వామివారి చరిత్ర సంగ్రహ కర్త తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉడిపి పెజావర మఠం ధర్మ ప్రచారక్ విధ్వాన్ రాఘవేంద్ర ఆచార్యతో కలిసి రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పుస్తకాన్ని(the book) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ చరిత్రను సంక్షిప్తంగా పుస్తక సంగ్రహకర్త విద్వాన్ రాఘవేంద్ర ఆచార్య వివరించారు.

భక్తులందరికీ స్వామివారి చరిత్ర అందించాలనే సంకల్పంతో పుస్తకాన్ని రూపొందించడం జరిగిందన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల (Brahmotsavala) సందర్భంగా భక్తులకు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు .ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి (Rammohan Reddy), మాజీ ఎంపీపీ అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్య , బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి .నరసింహ గౌడ్, మాజీ సర్పంచ్ మాన్వి రామారావు, ఆలయ ధర్మకర్త పి.ప్రాణేషాచారి, ఈవో కవితతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీ పడమటి అంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Leave a Reply