Book | స్వామి వివేకానంద బుఱ్ఱకథ పుస్తకావిష్కరణ

Book | స్వామి వివేకానంద బుఱ్ఱకథ పుస్తకావిష్కరణ
Book | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన శ్రీ రామకృష్ణ విద్యాలయం ప్రధానాచార్య, తెలంగాణ బుఱ్ఱకథ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండిరాజుల శంకర్ రచించిన ‘స్వామి వివేకానంద బుఱ్ఱకథ’ పుస్తకావిష్కరణ హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరై ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ బుర్రకథ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు డా. కె. వి. రమణాచారి 74వ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ ఆవిష్కరణను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ జానపద కళలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. కళల పట్ల, కళాకారుల రమణాచారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
బండిరాజుల శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుల డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు డా. కసిరెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతూ… సమాజంలో చైతన్యం తీసుకురావడంలో బుఱ్ఱకథ ప్రముఖపాత్ర పోషించిందని అన్నారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి సాలం కృష్ణయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ పోరెడ్డి రంగయ్య, కళాకారులు పాల్గొన్నారు.
