Bommareddypalli | ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..

Bommareddypalli | ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..

  • బొమ్మారెడ్డిపల్లి సర్పంచ్ అభ్యర్థి జనగామ తిరుపతి

Bommareddypalli | ధర్మారం, ఆంధ్రప్రభ : బొమ్మరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ గా తనను గెలిపించినట్లయితే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ అభ్యర్థి జనగామ తిరుపతి కోరుతున్నారు. గ్రామ ప్రజలు తనను ఆదరించి కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని బొమ్మారెడ్డిపల్లి ఓటర్లను కోరారు. ప్రజానీకానికి ఏ చిన్న ఆపద కలిగినా అండగా ఉండి వారి వెన్నంటి ఉంటానని చెప్పారు. గతంలో ఉపసర్పంచ్ గా, వార్డు మెంబర్ గా రెండుసార్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా అనుభవం ఉన్న వ్యక్తిగా తనను ఆదరించి గెలిపించాలని అభ్యర్థించారు.

బొమ్మ రెడ్డి పల్లి గ్రామం కోసం ఎంతటి సమస్యనైనా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లి క్షణాల్లో పరిష్కారిస్తానని హామీ ఇస్తున్నారు. సీసీ రోడ్లు, మురుగు కాలువలు, వడ్ల కొనుగోలు కేంద్రం, స్మశాన వాటిక పక్కన మంత్రి సహాయంతో చదును చేయించి శాశ్వతంగా ఉండేలా చూస్తానన్నారు. ఎస్సారె స్పీ పిల్ల కాలువ డాక్టర్ మునీందర్ చేను నుండి రాజుల గుట్ట ఏరియా వరకు నిర్మించేలా మంత్రితో మాట్లాడి తక్షణమే భూమిపూజ చేపిస్తానన్నారు. బొమ్మా రెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, ఊరు చివర నాలుగు దిక్కుల పశువుల కోసం వేసవిలో నీటి కొరత లేకుండా నీటి తొట్టిలను నిర్మిస్తానన్నారు.

ముఖ్యంగా యువతకు ఉద్యోగావకాశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో సీనియర్ నాయకులు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి సలహాతో మంత్రితో మాట్లాడి ప్రత్యేక చొరవ తీసుకొని స్థానం కల్పిస్తానన్నారు. అలాగే నంది మల్లన్న గుడి నుండి మెయిన్ రోడ్ వరకు వీధి దీపాలు ఏర్పాటు చేస్తానన్నారు. అధికారంలో ఉన్నామని, ఆదరించి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి గెలిపించాలని జనగామ తిరుపతి బొమ్మారెడ్డిపల్లె ప్రజలను కోరుతున్నారు.

Leave a Reply