ఆంధ్రప్రభ ప్రతినిధి మేడ్చల్, ఏప్రిల్ 3 : మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కు ఇవాళ బాంబు బెదిరింపు వచ్చింది. జిల్లా కలెక్టర్ గౌతం మెయిల్ కు ఈ మెయిల్ వచ్చినట్టు తెలిసింది. కలెక్టరేట్ ను మధ్యాహ్నం 3:30 గంటలకు కలెక్టరేట్ ను బాంబులు పెట్టి లేపేయడంతో పాటు కలెక్టర్ ను కూడా చంపేస్తామని మెయిల్ లో మెన్షన్ చేసినట్టు సమాచారం.
ఈ విషయం బయటికి పొక్కడంతో కలెక్టరేట్ సిబ్బంది ఉలిక్కి పడ్డారు. గుంపులు గుంపులుగా చేరి చర్చించుకోవడం విశేషం. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ ను కలిసివెళ్లారు. దీనిపైన జిల్లా కలెక్టర్ గౌతం కలెక్టరేట్ లో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి చర్చించారు. కాగా, ఈ బెదిరింపు కరీంనగర్ జిల్లా నుంచి లక్ష్మణ్ రావు అనే వ్యక్తి నుంచి (70) వచ్చినట్టు అధికార వర్గాల సమాచారం. ఇతను మాజీ మావోయిస్టు అయినట్టు మెయిల్ లో వచ్చిన సమాచారం బట్టి తెలుస్తోంది. అంతేకాకుండా, మెయిల్ చివరన ముస్లిం నినాదం కూడా పెట్టినట్టు అధికార వర్గాల నుంచి తెలిసిన సమాచారం.