Bollywood | కీర్తి ఈసారైనా సక్సెస్ సాధించేనా…?

Bollywood | కీర్తి ఈసారైనా సక్సెస్ సాధించేనా…?
Bollywood | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కృతి శెట్టి.. తెలుగులో తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించినా.. ఆతర్వాత సరైన కథలు ఎంచుకోకపోవడం వలన కెరీర్ లో వెనకబడింది. తమిళ్ (Tamil) లో సినిమా చేసింది. అయితే.. ఇంతలో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కృతికి కీర్తి సురేష్ షాక్ ఇచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఏమైంది..?

Bollywood | అందుకే కృతి వెనకబడిందా..
కృతి శెట్టి తెలుగులో ఉప్పెన సినిమాతో పరిచయమై అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆతర్వాత వరసుగా అవకాశాలు అందిపుచ్చుకుంది. శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ తదితర చిత్రాల్లో నటించింది. అయితే.. సరైన కథలు ఎంచుకోకపోవడం వలన ఒకప్పుడు వరుసగా సక్సెస్ ఫుల్ మూవీస్ లో (Movies) నటించిన కృతి.. వరుసగా ఫ్లాపు సినిమాల్లో నటించింది. దీంతో ఈ అమ్మడు గ్రాఫ్ పడిపోయింది. తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.

Bollywood | కృతి ముంబాయిలో అడుగుపెట్టింది కానీ..
తమిళ్ లో కార్తికి జంటగా నటించింది కృతి శెట్టి. ఈ సినిమా రిలీజ్ (Release) విషయంలో.. అడ్డంకులు. ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ లో ట్రై చేయాలి అనుకుంది. అక్కడ నుంచి ఆఫర్ వచ్చింది. కొత్త సంవత్సరంలో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అడిషన్ కోసం రెండు రోజులు ముంబాయిలో ఉంది. అయితే.. ఇక కృతి బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే.. ఊహించని విధంగా ఆ ఆఫర్ మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ కి దక్కింది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కృతి చేయాల్సిన సినిమాను కీర్తి సురేష్ దక్కించుకోవడం విశేషం. ఇది కృతికి షాకే అని చెప్పచ్చు.

Bollywood | స్పీడు పెంచిన కీర్తి..
కీర్తి సురేష్.. బాలీవుడ్లో బేబీ జాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్లాప్ (Movie Flop) అయ్యింది. అయినా ఆమె ఈ ఆఫర్ సొంతం చేసుకుంది. టైగర్ ఫ్రాఫ్, విద్యుత్ జమ్వాల్ మల్టీస్టారర్ ప్రాజెక్టులో ముందుగా కృతిని అనుకున్నా.. ఆతర్వాత కీర్తిని తీసుకున్నారు. బాలీవుడ్ లో కీర్తి సురేష్ కు ఇది రెండో సినిమా. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ చాలా వరుకు సినిమాలు తగ్గించేసింది. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది. విజయ్ దేవరకొండతో రౌడీ జనార్థనలో నటిస్తుంది. మలయాళ సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ మూవీకి ఓకే చెప్పింది. తెలుగులో ఓ భారీ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పిందని టాక్. మొత్తానికి కీర్తికి టైమ్ వచ్చింది.. స్పీడు పెంచింది. మరి.. కృతికి ఎప్పుడు టైమ్ వస్తుందో…?

