NLR | గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం..
ముత్తుకూరు, ఫిబ్రవరి 3 (ఆంధ్రప్రభ) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండల పరిధిలో నేలటూరు తీరం వద్ద రెండు రోజుల క్రితం గల్లంతైన షణ్ముఖ నాయుడు అనే విద్యార్థి మృతదేహం ఇవాళ లభ్యమైంది. స్థానిక ఎస్సై జేపీ శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని వెతికించారు.
ఏపీ జెన్కో ప్రాజెక్ట్ బ్రేక్ వాటర్ రాళ్ల వద్ద శవం ఉన్నట్లు కనుగొన్నారు. విద్యార్థి ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చూసి లబోదిబోమన్నారు. చనిపోయిన విద్యార్థి విశాఖపట్నంకు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు.