Bodhan | సక్రమంగా పౌష్టికాహారం అందజేయాలి

Bodhan | సక్రమంగా పౌష్టికాహారం అందజేయాలి

Bodhan | బోధన్, ఆంధ్రప్రభ : అంగన్వాడీ కేంద్రాలలోని చిన్నారులకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందజేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్రవారం బోధన్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి బోధన్ సెక్టార్ పరిధిలోని అంగన్ వాడీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని చిన్నారులకు, గర్భిణీ మహిళలకు సకాలంలో అందజేయాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యంపైన కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్, ఐసీడీస్ అధికారి, అంగన్ వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply