Bodhan | మౌలిక వసతుల క‌ల్ప‌న‌కు కృషి

Bodhan | బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ పట్టణంలో మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం బోధన్ పట్టణంలో పలు వార్డులలో ఆయ‌న పర్యటించారు. కాల్వ‌లు లేక మురుగు రోడ్ల పై ప్రవహిస్తుందని కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పట్టణ పారిశుధ్యంపై తీసుకుంటున్న చర్యలపై మున్సిపల్ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సలహాదారు వెంట సబ్ కలెక్టర్ వికాస్ మహతో, కమిషనర్ కృష్ణ, మున్సిపల్ మాజీ చైర్మన్ అనంపల్లి ఎల్లయ్య, మాజీ కౌన్సిలర్ సత్యం తదితరులు ఉన్నారు.

Leave a Reply