గోదావరిలో నాటు పడవ బోల్తా

ఉమ్మ‌డి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : మంచిర్యాల జిల్లా (Manchryala District) చెన్నూరు మండలం సుందర సాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈ రోజు గోదావరి (Godavari) నదిలో నాటు పడవలో మహారాష్ట్ర (Maharashtra)కు వెళ్తుండగా అన్నారం వద్ద ప్రమాదవశాత్తు బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఒకరు గల్లంతయ్యారు. ఈ పడవల ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కిష్ట స్వామి ఈత కొడుతూ ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నాడు.

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా (Gadchiroli district) సిరోంచ కు చెందిన ఇద్దరు మత్స్యకారులు చెన్నూరు మండలం పొక్కురు గ్రామంలో సంపత్ అనే వ్యక్తి వద్ద నాటు పడవ (Natu Padava) కొనుగోలు చేసి గోదావరి నది గుండా తమ సొంత గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జ‌రిగింది. అన్నారం బ్రిడ్జి (Annaram Bridge) వద్ద వరద గేట్లు దాటుతున్న క్రమంలోని నదీ (river) ప్రవాహ తాకిడికి తాళ‌లేక‌ బోటు తలకిందులైంది. గడ్డం వెంకటేష్ అనే వ్యక్తి వరదలు కొట్టుకుపోగా ఇప్ప‌టి వరకు ఆచూకీ తెలియ రాలేదు. గల్లంతైన గడ్డం వెంకటేష్ కోసం జాలర్లు (fishermen) గాలిస్తున్నారు.

Leave a Reply